ఇలియానా బాలీవుడ్ కోసం తెలుగుకి బ్రేక్ ఇచ్చి ముంబయిలోనే సెటిల్ అయ్యింది. 'బర్పీ, మే తేరా హీరో, రుస్తుం, రైడ్' లాంటి సినిమాలు చేసింది. అయితే అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఇలియానా బాలీవుడ్‌లో బిజీ కాలేకపోయింది. హిందీ కెరీర్ ఇప్పటికే క్లైమాక్స్‌కి చేరిందనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇలియానాకి బాలీవుడ్‌లో సిట్యువేషన్ అర్థమైపోగానే టాలీవుడ్‌కి రీ-ఎంట్రీ ఇచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజతో కలిసి 'అమర్ అక్బర్ ఆంటొని' చేసింది. అయితే ఈ మూవీ ఆడియన్స్‌కి పెద్దగా కనెక్ట్ కాలేదు. దీనికి తోడు ఇలియానా లుక్ బాగోలేదనీ... మునుపటి చార్మింగ్ కనిపించడం లేదనే కామెంట్స్ వచ్చాయి. దీంతో మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు ఇలియానా.
ఇలియానా తర్వాత నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలో నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీకి మొదట్లో కాజల్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే కాజల్‌కి ప్రెగ్నెన్సీ వచ్చాక ఈమె తప్పుకుంది. ఎందుకంటే హీరోయిన్ కూడా రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేయాల్సి ఉందట. అందుకే కాజల్ తప్పుకుంది. దీంతో ఇలియానాకి చోటిస్తున్నారు మేకర్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి