సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా..పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా తనదే రాజ్యం అన్నట్టుగా సినీ ఇండస్ట్రీని ఏలుతోంది. ఇక ఈమె పవన్ కళ్యాణ్ తో కలిసి అత్తారింటికి దారేది, మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి అల్లుడు శీను, ఎన్టీఆర్ తో కలిసి బృందావనం, రామయ్య వస్తావయ్య , జనతా గ్యారేజ్, రామ్ చరణ్ తో కలిసి రంగస్థలం వంటి ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి, వారు సాధించిన బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా సమంత నటించింది.


ఇకపోతే సమంతమాయ చేసావే సినిమా లో నటించక ముందు సిద్ధార్థతో ప్రేమలో పడినట్టు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. అంతేకాదు ఏ ఫంక్షన్ కి వెళ్ళిన, ఆడియో రిలీజ్ ఫంక్షన్ లు అయినా సరే ఖచ్చితంగా సిద్ధార్థ్ తో కలిసి వెళ్ళేది. అంతలా సిద్దార్థ్ కు దగ్గరైన ఈమె, ఆ తర్వాత కొన్ని కారణాల చేత దూరం కావాల్సి వచ్చింది.. అంతే కాదు ఒకసారి సమంత ఆహా టీవీ లో నిర్వహించిన శ్యామ్ జామ్  అనే షో కి హాజరైన మరొక్క సెలబ్రిటీ తో తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను పంచుకుంది.



సిద్దార్థ్ తో ప్రేమలో పడిన విషయం వాస్తవమే కానీ.. సిద్దార్థ్ ను  నేను పెళ్లి చేసుకొని ఉండుంటే ,మరో సావిత్రి అయ్యేదాన్ని.. సావిత్రి వైవాహిక బంధం లో ఎలాంటి  బాధలను అనుభవించిందో అంత కంటే రెట్టింపు స్థాయిలో నేను అనుభవించాల్సి ఉండేది.. కానీ దేవుడి దయతో నాగ చైతన్య నా జీవితంలోకి రావడం గొప్ప వరం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలబడి ధైర్యం ఇచ్చాడు. నాగచైతన్య లాంటి గొప్ప మనసున్న వ్యక్తిని వివాహం చేసుకోవడం  నా పూర్వజన్మ సుకృతం అంటూ ఎమోషనల్ అయింది సమంత. ఏది ఏమైనా సిద్ధార్థ తో బ్రేకప్ అయిన తర్వాత సమంత, నాగ చైతన్య వివాహం చేసుకొని సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: