పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉప్పెన, ఈ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు సన కు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. సుకుమార్ శిష్యుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు సన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఉప్పెన సినిమా తర్వాత ఎన్టీఆర్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయాలనుకున్న బుచ్చిబాబు సన కు ప్రస్తుతం ఎన్టీఆర్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల అది కుదరలేదు. బుచ్చిబాబు సన కు ఐశ్వర్య రాజేష్ నటన అంటే చాలా ఇష్టమట, తనతో ఒక సినిమా అయినా పని చేయాలని ఆయనకు ఉందట, రీసెంట్ గా ఆయన మనసులోని మాటను ఆ హీరోయిన్ కి చెప్పేశాడట. ఇక విషయంలోకి వెళితే . బుచ్చిబాబు గురించి హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేశ్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన విషయాలను తెలియజేసింది.

 తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికీ త‌మిళంలో హీరోయిన్‌గా ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్న ఐశ్వ‌ర్యా రాజేశ్ ఇప్పుడిప్పుడు తెలుగులోనూ సినిమాలు చెప్పు మంచి క్రేజ్  ను సంపాదించుకుంటుంది . ఈ ముద్దుగుమ్మ సాయితేజ్‌తో న‌టించిన చిత్రం రిప‌బ్లిక్ అక్టోబ‌ర్ 1 న థియేటర్లలో విడుదల కాబోతుంది. తెలుగులో వస్తున్న అవకాశాల గురించి ఐశ్వర్య రాజేష్ తెలియజేస్తూ. తెలుగు నుంచి ఆఫర్లు వస్తున్నాయి కానీ, డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంది అని తెలియజేసింది. రీసెంట్ గా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సన ను సైమా అవార్డు ఫంక్షన్ లో కలిశాను. మీ నటన నాకు చాలా బాగా నచ్చుతుంది. మీతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పారు. తప్పకుండా నేను బుచ్చిబాబు సనతో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాను. అని ఐశ్వర్య రాజేష్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: