సాధారణంగా సినీ సెలబ్రిటీలు సినిమాల్లోకి వచ్చిన తర్వాత తమ పేరును మార్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. నిజజీవితంలో చిన్నప్పుడు నుంచి పెట్టుకున్నది ఒక పేరు అయితే.. సినిమా ఇండస్ట్రీ లోకి రాగానే స్క్రీన్ నేమ్ అంటూ తమ పేరును మార్చుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన చాలామంది  పేరు మార్చుకున్నారు అని చెప్పాలి. హీరో హీరోయిన్లు అనే తేడా లేకుండా ఎంతో మంది తమ స్క్రీన్ నేమ్ తోనే  సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ పేరును స్క్రీన్ నేమ్ కి అనుగుణంగా మార్చుకున్న వారు ఉన్నారు. ఇలా పేరు మార్చుకున్న వారిలో అటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండటం గమనార్హం.


 ఎక్కడో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి గా మారిపోయింది ఆయన పేరు.  అయితే ఇలాగే అచ్చం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ప్రకాష్ రాజు కూడా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరును మార్చుకున్నాడట. ఈ విషయాన్ని ఇటీవలే ఒక  ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి ఇటీవలే ప్రకాష్ రాజ్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.



 ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ కి కమెడియన్ ఆలీ ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ని ప్రకాష్ రాయ్ అంటూ పిలిచాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. మీ పేరు అందరికీ ప్రకాష్ రాజ్ అని తెలుసు.. అయితే మీ అసలు పేరు ప్రకాష్ రాయ్ కాస్త ప్రకాష్ రాజు గా ఎలా మారింది   దీని వెనుక స్టోరీ ఏమైనా ఉందా అంటూ అలీ ప్రకాష్ రాజ్ ని అడుగుతాడు.  కె బాలచందర్ గారి వల్లే తన పేరు ప్రకాష్ రాయి నుంచి ప్రకాశ్ రాజ్ కి మారింది అంటూ చెప్పుకొచ్చాడు.  తన మొదటి యాక్టింగ్ చూసినప్పుడు ఫ్యూచర్ లో గొప్ప నటుడి అవుతావు అంటూ అప్పట్లో కె.బాలచందర్ గారు నాకు ప్రశంసించారు  అది ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: