మెగాస్టార్
చిరంజీవి స్థాయిని ఆయన స్టామినాని ప్రేక్షకులకు మరొకసారి చూపించిన చిత్రం ఠాగూర్. కథ ఈ
సినిమా కి పెద్ద హైలైట్ అనుకుంటే అది కాదు ఈ
సినిమా లోని డైలాగులు కూడా చాలా ప్లస్ అయ్యాయి అని చెప్పవచ్చు. ఓ ప్రమాదంలో
భార్య బిడ్డలని కోల్పోయిన ఓ లెక్చరర్ అది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం అనుకుంటాడు కానీ దాని వెనక ఎంతో మంది అధికారులు అక్రమంగా కట్టడాలు కట్టి తన
భార్య బిడ్డలు చనిపోవడానికి కారణాలు అని తెలుసుకుంటాడు.
అయితే ఈ విషయం ఎదిరించి వారితో పోరాడి లేని స్థితిలో ఉండి ఓడిపోతాడు.కానీ ఏ ఎస్ ఎఫ్ అనే పేరుతో గ్రూపును క్రియేట్ చేసి తన
కాలేజీ స్టూడెంట్ లతో ఎవరైతే ఎక్కువ లంచగొండితనం చేస్తారో వారిలో కొంత మందిని చంపి రాష్ట్రంలో ఎంతో పెద్ద సంచలనం సృష్టిస్తాడు. పోలీసులు ఓ వైపు విలన్స్ ఓ వైపు ఆ గ్రూప్ నాయకుడిని తీవ్రం గా వెతుకుతుంటారు. ఆ విధంగా లంచగొండితనంపై ఆయన చేసే పోరాటమే ఈ
సినిమా కథ. ఈ
సినిమా చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద హిట్
సినిమా చేశారు ప్రేక్షకులు.
ఈ సినిమాలో ఆయన తరచూ చెప్పే డైలాగ్ ఇప్పటికీ ఎంత ఫేమస్ అని చెప్పవచ్చు. తెలుగుభాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అనే డైలాగ్ ను ఆయన తరచూ వాడతారు. నిజానికి ఇది ఎంతో గొప్ప డైలాగ్ అని చెప్పవచ్చు. లంచం తీసుకునే ఓ లంచగొండి కళ్ళముందు చావు కనబడేసరికి లంచగొండి దారులు క్షమించమని వేడుకుంటూ ఉంటారు. అలాగే
చిరంజీవి కూడా పోలీసులకు దొరికిపోయిన తరువాత క్షమాభిక్ష కోసం అర్జీ పెడతాను అంటే అప్పుడు కూడా ఇదే డైలాగ్ చెప్పి అది తన విషయంలోనూ సేమ్ అని చాటిచెప్పాడు చిరంజీవి. ఆ విధంగా ఠాగూర్
సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. మాటలతో
పరుచూరి బ్రదర్స్ మాయ చేశారని చెప్పవచ్చు.
మురుగదాస్ కథ అందించగా
మణిశర్మ సంగీతం సమకూర్చాడు.