పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ కి 40 సంవత్సరాల వయసు వస్తున్నప్పటికీ ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతూ సినిమాలు చేస్తున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తలను ప్రభాస్ ఏ మాత్రం పట్టించుకోకుండా తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక మరోవైపు ప్రభాస్ పెద్దమ్మ ఇప్పటికే అతని పెళ్లి గురించి పలు సార్లు మీడియాతో మాట్లాడిన సంగతి  తెలిసిందే. 

ఇక అటు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా తన కొడుకు పెళ్లి ఎప్పుడు చేయాలి? తన కోడలు ఎలా ఉండాలి? అనే పలు రకాల అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు తన కోడలు గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. ఈ మేరకు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ..' ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ హీరో అయిపోయాడు. అతని చేతిలో కొన్ని వందల కోట్ల విలువ చేసే సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ దృష్టి మొత్తం ఆ సినిమాల పైనే ఉంది. ప్రభాస్ కాస్త ఫ్రీ అయితే కనివిని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా అతని పెళ్లి జరిపించాలని అని అనుకుంటున్నాము.

ఇక ప్రభాస్ కి బయట అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో అయితే కాదు. నా దృష్టికి కొన్ని వార్తలు వచ్చాయి. ప్రభాస్హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు అంటూ కొన్ని వార్తలు నా వద్దకు వచ్చాయి. కానీ వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదు. ప్రభాస్ ఎవరితోనూ ప్రేమలో లేడు. ఉంటే ముందు నాకే వచ్చి చెప్తాడు. అలాంటి వార్తలకు పుల్ స్టాప్ పెట్టండి. మేము చూసిన అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు' అంటూ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. మరి ప్రభాస్ భార్య కాబోయే ఆ బయట అమ్మాయి ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: