వకీల్ సాబ్ చిత్రంతో రాజకీయాల నుండి స్వల్ప విరామం తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చి న పవన్ కళ్యాణ్ లాయర్ గా సరికొత్త యాంగిల్ లో కనిపించి అలరించారు. రీ ఎంట్రీ తర్వాత వరుస చిత్రాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఓ వైపు భీమ్లా నాయక్ సినిమాతో బిజీగా ఉండగా, మరో వైపు క్రిష్ డైరెక్షన్ లో "హరిహర వీరమల్లు" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో రిలీజ్ కు సిద్ధం చేసేందుకు షూటింగ్ ను చకచకా కానిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఇంటర్వల్ వరకు మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. ఈ సినిమాలో చాలా స్పెషల్స్ ఉన్నాయి. పవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తొలి పీరియాడిక‌ల్ డ్రామా ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటు దొంగగా కనిపించబోతున్నారు.

ఇపుడు ఈ సినిమాకి సంబందించిన మరో న్యూస్ అందరినీ తెగ ఊరిస్తోంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇది నిజమేనా అంటూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ హాట్ న్యూస్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఓ చిన్న పాత్రలో అఖీరా అలా మెరుపులా కనిపించి వెళ్లనున్నారని  ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. పాత్ర చిన్నదే అయినా అది సినిమాకి చాలా కీలకమని అందుకే అన్ని విధాలుగా ఆలోచించి దర్శకుడు ఆ పాత్ర కోసం అఖీరా ను ఫైనల్ చేసినట్లు అంటున్నారు. మొదట ఇందుకు పవర్ స్టార్ ఒప్పుకోకపోయినప్పటికీ క్రిష్ రిక్వెస్ట్ చేయడంతో సరేనన్ననట్లు  చెబుతున్నారు.

ఇప్పటికే అఖీరాకు సంబందించిన సన్నివేశాలు కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి అఖీరా సినిమాలో కనిపిస్తున్న విషయం సస్పెన్స్ లో పెట్టి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నారట క్రిష్ . ఇంతకీ ఇందులో ఎంత నిజముందో చూడాలి. ఇది కనుక నిజమయితే మెగా ఫ్యాన్స్ కు పండగే అంటున్నారు సినిమా విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: