'ఆర్ ఆర్ ఆర్' మేనియా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపధ్యంలో ఈ సినిమా దర్శకుడు రాజమౌళి సైతం పక్కా ప్లానింగ్ తో ఆ అప్డేట్స్ ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మరో టీజర్  విడుదల కాబోతోంది. అయితే ఈ టీజర్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఉండే సీన్స్ ఉంటాయని.. అయితే టీజర్ లో మాత్రం ఎలాంటి డైలాగ్స్ ఉండవని సమాచారం. టీజర్ లో కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నే ఈ సినిమా కథకు సంబంధించి..

 ప్రేక్షకుల్లో అవగాహన కల్పించే విధంగా రాజమౌళి ఈ టీజర్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరగబోతున్నాయి. ఇక డిసెంబర్ నెలలో ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతున్న ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ నగరాల్లో త్రిబుల్ ఆర్ ప్రచారాన్ని పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాజమౌళి త్రిబుల్ ఆర్ నటులతో కలిసి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు,  పూణే, కొచ్చిన్, ముంబై తో పాటు ఇతర నగరాల్లో కూడా ప్రచారం నిర్వహించనున్నారని సమాచారం. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో 0పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా..

వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా రన్ టైం ని కూడా రాజమౌళి ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా రఫ్ ఎడిట్ మొత్తం మూడు గంటలకుపైగా వచ్చిందట. అయితే ఇందులో అనవసర సన్నివేశాలు తొలగించి సినిమా నిడివి రెండు గంటల 45 నిమిషాలకు కుదించినట్లు సమాచారం. ఇక సినిమాలో చివరి 30 నిమిషాలు ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ట్విస్టులు ఉంటాయని అవి కచ్చితంగా ప్రేక్షకులను కంటతడి పెట్టించే విధంగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR