ఇక తెలుగు బుల్లితెర సీరియల్స్ విషయానికొస్తే, మౌనరాగం , మనసు మమత వంటి ఎన్నో సీరియల్స్ లో నటించి ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నారు శ్రావణి కొండపల్లి. అటు సినీ ఇండస్ట్రీ పరంగా ఇటు బుల్లితెర ఇండస్ట్రీ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రావణి 2020 సెప్టెంబర్ 9వ తేదీన బుధవారం తన ఇంటి బాత్రూంలో ఉరి వేసుకుని మరణించింది. అయితే ఈమె ఒక టిక్ టాక్ స్టార్ అయినా దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు..
కానీ ఇంట్లో పెద్దలు మందలించడంతో శ్రావణి అతని వైపు చూడలేదు.. కానీ అతను మళ్ళీ పదేపదే ఆమె వెంట పడుతుండటం తో ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ అతడు ఆమె ఫోటోలను తీసి బెదిరిస్తూ ఉండడం.. లక్ష రూపాయల వరకు శ్రావణి నుంచి తీసుకున్నాడు దేవరాజ్ రెడ్డి. రోజురోజుకు ఇతడి ఆగడాలు ఎక్కువ అవుతున్నప్పటికీ భరించింది..అయితే అతడు ప్రతిసారి శ్రావణినీ బెదిరిస్తూ ఉండడంతో ఆమె పరువు పోతుంది అనే భయంతో తీవ్ర మనస్థాపానికి గురి అయి ఉరి వేసుకుని చనిపోయింది. కేవలం 26 సంవత్సరాల వయసులోనే శ్రావణి మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురయింది. అంతేకాదు ఈమె మరణం వెనుక ప్రముఖ సినీ నిర్మాత అశోక్ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి