అక్కినేని హీరో సుమంత్ కెరీర్ ఇప్పుడిప్పుడే మళ్లీ గాడి లో పడుతుంది. ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడని చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సుమంత్ ఆ తరువాత ట్రెండ్ కి తగ్గ సినిమాలు చేయక పోవడంతో ఆయన ఫేడ్ అవుట్ అయిపోయాడు. కానీ మళ్ళీ ఆయన సినిమాలు చేయడం మొదలు పెట్టి ప్రేక్షకులు మెచ్చే సినిమాల ను చేయడంతో ఆయన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీరావా అనే చిత్రం చేయ గా అది ప్రేక్షకుల ను ఎంతగానో మెప్పించింది. ఆ సినిమాతో గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా పరిచయం అవగా ఓ నేషనల్ లెవెల్ దర్శకుడిని పరిచయం చేసిన ఘనత అందుకున్నాడు సుమంత్. ఈ సినిమా చేసిన తరువాత గౌతమ్ జెర్సీ అనే సినిమాను చేయగా ఆ చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు అదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కిస్తున్నాడు సుమంత్. ఈ సినిమాతో విజయం సాధించిన తర్వాత వరుసగా మంచి మంచి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. 

తాజాగా ఆయన మళ్ళీ మొదలైంది అనే సినిమా చేస్తున్నాడు. భార్య భర్తల కాన్సెప్టుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు ఉండగా ఈ సినిమా తప్పకుండా అందరి నీ అలరిస్తుందని భావిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా అది సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ సినిమా కూడా మళ్లీ రావా చిత్రం తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తే అని అందరు భావిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా వెరైటీ కథనంతో తెరకెక్కబోతుంది అన్న విషయం క్లియర్ గా అర్ధం అవుతుం ది. మరి ఈ సినిమాతో సుమన్ హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: