సిద్ధార్థ 8 సంవత్సరాల తర్వాత మల్టీస్టారర్ మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో మరొక హీరో శర్వానంద్ కూడా నటించాడు. ఆ సినిమానే మహాసముద్రం. ఈ సినిమాకి దర్శకుడు గా అజయ్ భూపతి వహించాడు. అజయ్ భూపతి ఈ సినిమాని లవ్, యాక్షన్, సస్పెన్స్ గా రూపొందించడం జరిగింది. ఈ మూవీలో హీరోయిన్స్ గా అను ఇమ్మాన్యుయేల్, హైదరి నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ల అందాల ఆరబోత ప్లస్ అవుతుందని అనుకున్నప్పటికీ కానీ ఆకట్టుకోలేకపోయింది.


సినిమా అక్టోబర్ 14వ తేదీన విడుదలైంది. మొదటిరోజు పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ, కానీ కలెక్షన్లు మాత్రం కొల్లగొట్ట లేకపోయింది. మొదటి వీక్ కే డిజాస్టర్ వైపుగా అడుగులు వేసింది. ఇక అంతే కాకుండా కొన్ని థియేటర్లలో సినిమాను తొలగించడం కూడా జరిగింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల వివరాలు వస్తే.

1). నైజాం-2.10 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-1.21 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-87 లక్షలు.
4). ఈస్ట్-48 లక్షలు.
5) వేస్ట్-39 లక్షలు.
6). కృష్ణ-37 లక్షలు.
7). గుంటూరు-59 లక్షలు.
8). నెల్లూరు-33 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే తే..6.34 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్ కలుపుకొని-62 లక్షలు.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..6.96 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

మహా సముద్రం సినిమా 16.48 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా సక్సెస్ కావాలంటే 17 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమా ముగిసే సమయానికి కేవలం 6.96 కోట్ల రూపాయలనే రాబట్టింది.దీంతో ఈ సినిమాకు ఉన్న బయ్యర్లకు 9.52 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా వీళ్ళ కెరీర్నే మారుతుంది అనుకుంటే. ఈ చిత్రం కూడా వీరికి డిజాస్టర్ గానే మిగిలిపోయింది. అయితే ఈ సినిమా తో సిద్ధార్థ మాత్రం ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: