టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమా పరిశ్రమలో అతి తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు. వారు తమ ప్రతిభతో ఇన్ని రోజులుగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్నారు. కొంతమంది టాప్ హీరోయిన్ లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారగా ఇంకా కొంతమంది డైరెక్ట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. 

ఆ విధంగా తెలుగునాట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతోంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. ఆమె ఎన్నో చిత్రాల ద్వారా ఇప్పటి వరకు ప్రేక్షకులను ఎంతగానో లభించగా ఏమైంది ఈ వేళ సినిమా లో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు గాను ఆమెకు ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం లభించింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈమె చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి తల్లి సాయంతో ఇక్కడిదాకా వచ్చింది. మొదట్లో కార్టూన్ పాత్రలకు గాత్రదానం చేసి ఆ తర్వాత నటిగా మారింది.

ఆమె కాలేజీలో చదువుతున్న కాలంలోనే ఓ ప్రకటనలో కనిపించింది. ఆ ప్రకటన చూసిన తమిళ దర్శకుడు భాగ్యరాజ్ తన సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. అలా రెండు సంవత్సరాల పాటు తమిళ సినిమాల్లో కూడా నటించి ఆ తర్వాత వివాహం కావడంతో కొద్దిరోజులు విరామం తీసుకుని మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో సహాయ నటిగా అమ్మ, అత్త పాత్రలో నటించడం మొదలుపెట్టింది. ఇక ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియా వేదికగా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె టాటూలు వేయించుకుని కుర్రకారు లో సెగలు రేపుతున్నారు. అంతే కాకుండా ఆమె చేసే పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో నచ్చుతున్నాయి. ఆమధ్య ఆమె విడుదల చేసిన జిమ్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: