ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపేస్తుంది ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి విడుదలైననాటు నాటు పాట. ఇటీవలే నవంబర్ 10వ తేదీన విడుదలైన ఈ పాట అటు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులను కొల్లగొడుతుంది. సాధారణంగానే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అంటే చాలు దీని కోసం అందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు.  అలాంటిది ఏకంగా టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఒకే పాటలో ఒకేసారి అదిరిపోయే డాన్స్ చేయడం ఇక ఆ సినిమా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కావడంతో ప్రస్తుతం రికార్డులను క్రియేట్ చేస్తుంది అని చెప్పాలి.


చిన్న ల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరిని కూడా ఈ పాట ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ నాటు నాటు పాటే వినిపిస్తుంది అని చెప్పాలి. ఇక ప్రతి ఒక్కరూ చాలా సార్లు ఈ పాట వినడానికి ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ పాటలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేసిన డాన్స్ చూస్తే ఫిదా అయిపోతారు అని చెప్పాలి.. అయితే ఇక ఈ నాటు పాట చూసిన తర్వాత కొంతమంది డాన్స్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన స్టెప్పులను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


 ఒకవేళ మీరు కూడా ఇలా నాటు నాటు పాటలోని ఇద్దరు స్టార్ హీరోలు చేసిన డాన్స్ నేర్చుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఈ వీడియో చూసి ఎంతో సులభంగా నేర్చుకునేందుకు అవకాశం ఉంది.. ఇటీవలే నాటు నాటు అనే పాట విడుదల అయిందో లేదో ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు చేసిన స్టెప్స్ ఎలా చేశారు ఎలా నేర్చుకోవచ్చు అనే విషయాలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే కొంతమంది ఇక ఈ స్టేప్పులపై ట్యుటోరియల్ వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా సింపుల్గా నేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: