అబ్బో.. పెళ్లికి ముందు ..ఆ తరువాత వీళ్లు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఫంక్షన్ లు , ఫోటోలు, ఆటలు, పాటలు,డ్యాన్సులతో ఘనంగా పెళ్లిచేసుకున్నారు. సరే ఇంత వరకు బాగానే ఉంది ..కానీ అంతలోనే ఏం అయ్యిందో తెలియదు కానీ..ఇద్దరు విడిపోతున్నాం అంటూ ఓ పోస్ట్ పెట్టి చేతులు దులుపుకున్నారు. ఇక సీన్ కట చేస్తే.. నాగ చైతన్య ఇంటికి దూరంగా ఓ ఫ్లాట్ లో ఉంటూ..తన నెక్స్ట్ సినిమాలు గురించి ఆలోచిస్తున్నాడు. ఇక సమంత మాత్రం నాగ చైతన్యతో గడిపిన ఆ ఇంట్లోనే ఉంటూ వరుస సినిమాలకు సైన్ చేస్తుంది.
ఇప్పటికే మూడు బడా ప్రాజెక్ట్ లకి సైన్ చేసిన ఈ ముద్దుగుమ్మ..రీసెంట్ గా క్రేజీ కాంబినేషన్ అయిన బన్నీ,సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న పుష్ప సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ విషయమై పుష్ప టీం అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. అయితే, సమంత ఏం ఊరికే ఈ పాట చేయడానికి ఒప్పుకోలేదట. సుకుమార్ కు కొన్ని కండీషన్స్ పెట్టి మరీ..వాటికి ఒప్పుకుంటేనే ఆమె సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సుకుమార్ ఈ పాటకోసం ఓ భారీ సెట్ వేస్తాను అన్న క్రమంలో ..సమంత ఈ సాంగ్ కి సంబంధించిన పనులు..షూట్ మొత్తం రామోజీ ఫిలిం సిటీ లోనే చేయాలని సమంత డిమాండ్ చేసిందట. అంతేకాదు ఈ సాంగ్ సెట్ కానీ, లుక్స్ కానీ..అంతేందుకు షూటింగ్ జరిగే ఐదు ఆరు రోజులు చాలా గోప్యంగా ఉంచాలని అడిగిందట. అంతేకాదు ఆ టైంలో అక్కడ నాగార్జున ఫ్యామిలీ ఎవరు షూటింగ్ కు రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకోమన్నారట. ఈ కండీషన్స్ కు సుకుమార్ ఒకే చెప్పిన తరువాతనే ..సమంత ఈ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి చూడాలి అమ్మడు ఈ పాటకు ఎంత న్యాయం చేస్తుందో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి