అగ్ర హీరోలే కాదు కొందరు నటులు తమ నటనా ప్రతిభతో వారికి మించిన అభిమానాన్ని పోగుచేసుకుని ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకత చాటుకుని పట్టు సాధిస్తారు. అలాంటివారిలో ఒక్కరే కైకాల సత్యనారాయణ. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. మొదట "సిపాయి కూతురు" అనే సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేసిన ఈయన "నాపేరు భగవాన్", "మొరటోడు" చిత్రాలలో హీరోగా చేసి మెప్పించారు. ఒక దశలో ఈయన విలన్ పాత్రల వైపు ఎక్కువ మొగ్గు చూపే సమయంలో ఈయన విలనిజంకు మెచ్చి అన్ని విలన్ పాత్రల్ని ఎక్కువగా కైకాలకే ఇచ్చేవారు. దాంతో అప్పటి వరకు విలన్ రోల్స్ కు ఫామ్ లో ఉన్న రాజనాల బాగా వెనుకబడ్డారు.

దాంతో కైకాలతో ఆయనకు మనస్పర్ధలు ఉండేవని, రాజనాల అసలు కైకాల కనిపించినా పెద్దగా మాట్లాడేవారు కాదట. తొలినాళ్ళలో కైకాల ముఖం, ఆ హెయిర్ స్టైల్ అంతా రామారావుకు దగ్గరగా ఉండటంతో ఆయన ఎన్నో చిత్రాలలో ఎన్టీఆర్ కు డూప్ గా కూడా చేశారు.  హీరోగా ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేసిన కదలడు వదలడు, రాముడు భీముడు, గజదొంగ, భోపాలుడు భూపాలుడు వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ కు డూప్ గా నటించారు. ఈయన నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. రమా ఫిలిమ్స్ అనే పేరుతో  నిర్మాణ సంస్థను నెలకొల్పి చిత్రాలు నిర్మించారు.

కొదమ సింహం, గజదొంగ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయన నిర్మాణ సంస్థలో  రూపుదిద్దుకున్నవే. చిత్ర సీమలో ఎన్టీఆర్ సత్యనారాయణ ల అనుభందం అపురూపమైనది. ఇద్దరు ఒకే తల్లి బొడ్డల్ల సొంత అన్నదమ్ముల్లా మెలిగేవారు. కొందరైతే వీరు నిజంగా అన్నదమ్ములేమో అనుకుని నేరుగా వీరినే అడిగేవారట, అలా కొన్ని సందర్భాలు ఎదురయ్యాయట. ఎన్టీఆర్ రామారావు నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. అంతేకాదు ఈయన ఎన్టీఆర్ బయోపిక్ లో నటించి మైమరిపించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: