కొన్ని కొన్ని సార్లు కొంత మంది హీరోయిన్లకు ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే తమ సొంత భాషలో వారికి ఆదరణ కరువవుతోంది. దాంతో ఇతర భాషలలోకి వలస పోయి అక్కడ సినిమాలు చేస్తూ ఉంటారు. అక్కడ వారికి మంచి ఆదరణ లభిస్తుంది. ఆ విధంగా తెలుగు
సినిమా పరిశ్రమలో
హీరోయిన్ గా నటించాలని చాలా మంది
హీరోయిన్ లు ప్రయత్నాలు చేయగా అవి విఫలమైతే ఇతర భాషలలోకి వెళ్లి అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుని స్టార్
హీరోయిన్ గా ఎదిగారు. వారిలో ఒకరు
హీరోయిన్ అంజలి.
తెలుగులో ఆమె ఒకటి రెండు చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా అవి ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. దాంతో ఆమె
తమిళ సినిమా పరిశ్రమ లోకి వెళ్లి అక్కడ
సినిమా లలో నటించి నటిగా మంచి గుర్తింపు దక్కింకుంది. ఈ క్రమంలోనే అక్కడ స్టార్
హీరోయిన్ అయ్యింది. అలా అక్కడ వచ్చిన క్రేజ్ తోనే తెలుగులో సినిమాలు చేయడం మొదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆవిధంగా దిల్ రాజు నిర్మాణం లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే
సినిమా లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
చేసిన తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో అందరి దర్శక నిర్మాతల చూపు ఆమెపై పడింది. అచ్చమైన తెలుగు అందం సంప్రదాయానికి చీర కట్టినట్లు ఉండే రూపం కలగలిపి ఆమెను వరుస సినిమాలలో నటించే లా చేసిందని చెప్పవచ్చు. స్టార్ హీరోలందరి సరసన ఆమె
హీరోయిన్ గా నటించగా ప్రస్తుతం కొత్త హీరోయిన్ల రాకతో ఈమెకు డిమాండ్ తగ్గిందనే చెప్పవచ్చు. ఏదేమైనా తెలుగు
సినిమా పరిశ్రమలో కొంతకాలం ఈమె స్టార్
హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వచ్చి యువత ను కట్టిపడేసింది అని చెప్పవచ్చు. మళ్లీ ఆమె తెలుగులో ఎలాంటి కం బ్యాక్ చేస్తుందో చూడాలి.