బిగ్బాస్ ఆట రోజురోజుకు రసవత్తరం గా మారిపోతుంది. 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగా ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారు . ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఎనిమిది మందిలో ఎవరు ఎలిమినేట్ అయి బయటికి వస్తారు ఇక ఎవరు టాప్ ఫైవ్ లో నిలుస్తారు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఎప్పటిలాగానే బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ కాస్త సందడి సందడిగా మారిపోయింది . ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వచ్చే సందడి చేయడంతో హౌస్ లో టాస్క్ లతో రాసుకున్న వేడి కాస్తచల్లారింది అనే చెప్పాలి.


వీకెండ్ లో వచ్చిన నాగార్జున ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ మరో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చేశాడు. ఏకంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు సంబంధించిన మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ని స్టేజి మీదికి పిలిచారు. ఈ క్రమంలోనే మొదట యాంకర్ రవి తల్లి ఉమాదేవి స్టేజి మీదికి వచ్చారు. తల్లిని చూసి  యాంకర్ రవి ఎంతగానో ఎమోషనల్ అయిపోయాడు. ఈ క్రమంలోనే టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అంటూ నాగార్జున అడగడంతో రవి, సన్నీ, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, మానస్‌లు వరుసగా టాప్‌ 5లో వస్తారు అంటూ తెలిపింది.


 ఆ తర్వాత పింకీ కోసం జబర్దస్త్ అప్పారావు, సాయి లేఖలు స్టేజి మీదికి వచ్చారు. ఈ క్రమంలోనే టాప్ ఫైవ్ లో ఎవరు నిలుస్తారు అంటూ అడగగా వీరు ప్రియాంకను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్‌, రవి, మానస్‌లను టాప్ ఫైవ్ లో పెట్టారు. ఇలా అందరూ పేరెంట్స్ వచ్చి బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఎవరు నిలవబోతున్నారు అన్న విషయాన్ని తెలియజేశారు. ఇలా ఇటీవలే శనివారం ఎపిసోడ్ లో స్టేజి మీదికి వచ్చి అందరూ టాప్ ఫైవ్ లో ఎవరు నిలవ బోతున్నారు అనే విషయం తెలిపారు. ఇక మొత్తంగా చూసుకుంటే బిగ్ బాస్ విన్నర్ గా సన్నీ కాబోతున్నాడు అని చెప్పకనే చెప్పారు అందరూ. ఎందుకంటే బిగ్బాస్ స్టేజి మీదికి కుటుంబ సభ్యులు అందరూ కూడా సన్నీ  ఫోటోని టాప్ ఫైవ్ లో లోని మొదటి రెండు స్థానాల్లోనే పెడుతూ వచ్చారు. ఇలా సన్నీ విన్నర్ అన్న విషయాన్ని అందరూ చెప్పకనే చెప్పారు అంటూ అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: