సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఈ సినిమాలో రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య సన్నివేశాలు చాలా ఉత్కంఠ రేపే విధంగా ఉంటాయి అన్నట్లుగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ లు, పోస్టర్లు చెబుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా  లో పవన్ కళ్యాణ్ కు భార్య పాత్రలో నిత్యమీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంతేకాదు తాజాగా వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రకారం.. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో కామెడీ రోల్స్ లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో మాత్రం చాలా సీరియస్ పాత్రలో మనకు కనిపించబోతున్నారట. ఈ విషయాన్ని చిత్రం మేకర్స్  స్వయంగా తెలియజేయడం గమనార్హం. ఇప్పటివరకు రాజేంద్రప్రసాద్ ను చూడని ఒక సరికొత్త యాంగిల్లో భీమ్లా నాయక్ సినిమాలో మనకు చూపించబోతున్నారు అట.


ఇక పవన్ కళ్యాణ్, రానా ఇద్దరు కూడా ఆవేశ పరులైన పాత్రలలో నటిస్తూ చూపించడమే కాకుండా వీరి ఇద్దరితో  సంబంధం ఉండే ఒక రాజకీయ నాయకుడి పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులను తన కామెడీతో నవ్వించిన రాజేంద్రప్రసాద్ నటకిరీటి గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే మొదటిసారిగా ఈయన ఇలా రాజకీయ నాయకుడి పాత్రలో చాలా సీరియస్ పర్సన్ గా కనిపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయంపై ప్రేక్షకులు ఆరాధిస్తున్నారు. అంతేకాదు ఈ  సినిమా పై  రాజేంద్రప్రసాద్ కారణంగా  అంచనాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.


ఇకపోతే పవన్ కళ్యాణ్ కు  సంబంధించిన చివరి షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా.. సంక్రాంతి పండుగకు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: