అరియానా గ్లోరీ.. మొదట ఈ పేరు కొంతమందికే తెలిసినా..ఇప్పుడు మాత్రం చాలా మంది కి ఈమె రోల్ మోడల్ లా కనిపిస్తుంది. దీనంతటికి కారణం బిగ్ బాస్. తెలుగులోనే అతి పెద్ద రియాలీటీ షో అయిన బిగ్ బాస్ పుణ్యమా అంటూ ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు టాప్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. బిగ్ బాస్ షో ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటూ..వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు కొందరు కంటెస్టెంట్స్. అలాంటి వారిలో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గోన్న కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీ కూడా ఉన్నారు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఎందరో అభిమానులను సంపాదించుకుని.. టాప్ 5 లో ఒక్కరుగా నిలిచారు అరియానా. బిగ్ బాస్ తరువాత ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ భామ. నాలుగు షోలు, మూడు సినిమాలు చేసుకుంటూ కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది.

ఇక రీసెంట్ గా బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.  రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన మూవీ.. "అనుభవించు రాజా". రీసెంట్ గానే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.  ఈ సినిమాలో అరియానా కూడా ఓ కీలక పాత్ర లో నటించింది. ఇక రీసెంట్ గా  ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియానా రాజ్‌ తరుణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అరియానా కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ మారాయి.

ఆ ఇంటర్వ్యుల్లో అరియానా మాట్లాడుతూ.." అసలు నిజం చెప్పాలంటే.. హీరో రాజ్‌ తరుణ్‌ అంటే నాకు ఇష్టం లేదు. ఆయన అంటే నాకు  నచ్చాదు.. ఎప్పుడైన ఇంట్లో టీవీ చూస్తుంటే  ఆయన సినిమాలు వస్తే వెంటనే ఛానల్ మార్చేసేదాని. ఇంకా చెప్పాలంటే ఆయనకు యాక్సిడెంట్‌ జరిగి కాలో, చెయ్యో విరిగిపోవాలి అనుకున్నా" అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. దీంతో అసలు ఎందుకని రాజ్ తరుణ్ అంటే అంత అసహ్యమని అడగ్గా.. అరియానా రిప్లై ఇస్తూ.."ఆయన నన్ను చాలా సార్లు బాధ పెట్టారు.  ఇంటర్వ్యూకి పిలిచి చాలా సేపు వేయిట్‌ చేయించి .. ఫైనల్ గా నాకు ఇంటర్వ్యు ఇవ్వకుండానే..నా ముందే కారులో వెళ్ళిపోయారు..ఇలా రెండు మూడు సార్లు చేసారు. దీంతో ఆయన అంటే నాకు అసహ్యం వచ్చేసింది" అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: