నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా కు టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా, ముద్దు గుమ్మ లు ప్రగ్యా జైస్వాల్, పూర్ణా హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో శ్రీకాంత్ విలన్ పాత్ర లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రావడం తో ఈ సినిమా పై జనాల్లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. దానికి తగినట్టు గానే  ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, టీజర్ లకు, సాంగ్స్ కు, ట్రైలర్ లకు కూడా అదిరి పోయే రేంజ్ లో ఉండడం తో ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి.

 ఇలా ప్రేక్షకు లలో ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 2 వ తేదీ న ప్రపంచ వ్యాప్తం గా థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే యు ఎస్ ఏ లాంటి చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షో లు పడిపోయాయి. అక్కడి నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది, మరీ ముఖ్యం గా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోయింది, ఓ రేంజ్ లో ఉంది అంటూ టాక్ వినిపిస్తోంది. అదే విధంగా ఈ సినిమాకు తమన్ అదిరి పోయే సంగీతాన్ని మాత్రమే కాకుండా అంతకు మించిన బిజియం ను అందించాడు అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పై నెలకొన్న అంచనాలు దానికి తగినట్టుగా వస్తున్న పాజిటివ్ టాక్ ఇవన్నీ కలిసి బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరే పోతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: