సాధారణంగా సంక్రాంతి పండుగకు రెండు రోజులు ముందు టాప్ హీరోల సినిమాలు విడుదల అవ్వడం ఎప్పటి నుంచో సాంప్రదాయం. అయితే ఈసారి సంక్రాంతి పండుగకు వారంరోజులు ముందు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాబోతోంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీ సూపర్ హిట్ అని అనిపించుకోవాలి అంటే ఈమూవీకి అత్యంత భారీ స్థాయిలో కలక్షన్స్ రావాలి.


అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఈసినిమాకు ఉందా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదలైన కేవలం 5 రోజులకు ‘భీమ్లా నాయక్’ రాబోతోంది. ఆతరువాత మరో రెండు రోజులకు ‘రాథే శ్యామ్’ వస్తోంది. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు మళ్ళీమళ్ళీ ‘ఆర్ ఆర్ ఆర్’ ను చూడకుండా అదే సీజన్ లో విడుదల కాబోతున్న మిగతా సినిమాల వైపుకు మళ్ళిపోతారు.

దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ తగ్గిపోయే ఆస్కారం ఉంది. దీనికితోడు పవన్ ప్రభాస్ అభిమానులు ‘ఆర్ ఆర్ ఆర్’ పై నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉంది అన్న సందేహాలు వస్తున్నాయి. దీనితో సగటు ప్రేక్షకుడు కన్ఫ్యూజన్ కు గురైతే అసలకు మోసం వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. దీనికితోడు ఇదే సంక్రాంతి రేస్ కు తమిళ టాప్ హీరో అజిత్ నటించిన ‘వాలిమై’ కూడా రిలీజ్ అవుతుంది. అజిత్ సినిమా అంటే తమిళ ప్రేక్షకులకు ఒక పండుగ.


ఇలాంటి పరిస్థితులలో తమిళనాడులో ‘ఆర్ ఆర్ ఆర్’ నిలదోక్కుకోగలదా అన్న సందేహాలు కూడ ఉన్నాయి. అయితే గతంలో బాహుబలి విడుదలైనప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు . ‘బాహుబలి’ విడుదలైన మరో నెలరోజుల వరకు విడుదల కావడానికే భయపడి పోయింది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఇన్ని నెగిటివ్ పరిస్థితుల మధ్య ‘ఆర్ ఆర్ ఆర్’ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని ‘బాహుబలి’ స్థాయిలో విజయం సాధించగలుగుతుందా అని ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలను వెంటాడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: