అంటే గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ వారు కొట్టిపారేశారు. కానీ ఈసారి మాత్రం ఇది నిజమే అని ఒక ప్రోమో విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ ప్రసారమౌతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇది విడుదల చేశారు. అయితే ఈసారి సుడిగాలి సుధీర్ టీమ్ సభ్యులు.. కాస్త వెరైటీగా స్కిట్ చేయడం జరిగింది. అలా లైవ్ షో కావడంతో.. రాకెట్ రాఘవ, హైపర్ ఆది అంటే ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ జరిగిన కొన్ని సన్నివేశాలను ఒక వీడియో రూపంలో ప్రసారం చేయడం జరిగింది.అయితే అలా సాఫీగా సాగుతున్న.. ఈ ప్రోమో లో చివరిలో ఈ ముగ్గురు కమెడియన్స్ వచ్చి ఒక బాంబు పేల్చారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ ఈ జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోతున్నానని తెలియజేశారు. ఈ విషయాన్ని ఏదైనా ఒక ఇంటర్వ్యూలో చెప్పాలనుకున్నారట. కానీ చివరికి ఇలా స్టేజీపైన చెప్పాల్సి వచ్చింది అని తెలియజేశారు. ఇన్ని రోజులు బాగా ఆదరించినందుకు తమ ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలియజేశారు. చివరిసారిగా ముగ్గురు కలుసుకొని కౌగిలించుకొని.. కన్నీటి పర్వతం అయ్యారు. అయితే వీరంతా కేవలం సినిమాలలో బిజీగా ఉండడం వల్లే.. ఇలా చేస్తున్నారని వార్త వినిపిస్తోంది. ఇక రామ్ ప్రసాద్ కూడా పలు సినిమాలలో రైటర్ గా అవకాశాలు వచ్చినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి