టాలీవుడ్‌లో సక్సెస్ పుల్ ప్రొడ్యుసర్ అయిన తండ్రి అండతో కలియుగ పాండవులు సినిమాతో తొలి అడుగులు వేసినా.. ఆయన ప్రతిభతో క్లాస్, మాస్, కుటుంబ నేపథ్యం ఇలా అన్ని రకాల సినిమాలు చేసి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు విక్టరీ వెంకటేష్. ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతూ.. తనదైన సత్తా చాటుతూనే ఉన్నాడు. శ్రీనివాసకల్యాణం, స్వర్ణకమలం, గణేష్, నువ్వునాకునచ్చావ్, లక్ష్మీ వంటి డిఫరెంట్ సినిమాలతో నటుడిగా ఒక మూసకు మాత్రమే పరిమితం కాలేదు. మరొక వైపు చంటి, సుందరకాండ, చినరాయుడు, పవిత్రబంధం, రాజా, సంక్రాంతి లాంటి సినిమాలతో ఫ్యామిలీ హీరోగా.. బొబ్బిలిరాజా, శత్రువు, ధర్మఛక్రం, వంటి సినిమాలు మాస్ ప్రేక్షకులను.. ప్రేమ, ప్రేమంటే ఇదేరా.. ప్రేమించుకుందాంరా, వాసు లాంటి సినిమాలతో యువతకు దగ్గరయ్యారు వెంకటేష్.
ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వచ్చిన బొబ్బిలిరాజా వెంకటేష్‌కు స్టార్‌డమ్ తీసుకొచ్చినది. అదేవిధంగా 1991లో వచ్చిన చంటి సినిమా వెంకటేష్ కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలిపింది. అందులో వెంకీ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా హీందీలో సైతం అనాడిగా రీమేక్ అయినది.ఈ సినిమాతో అప్పట్లో బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. ప్రస్తుత తరుణంలో తెలుగు మల్టీస్టారర్ మూవీలకు మరొకసారి ఊపిరి పోసాడు వెంకీ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఆ తరువాత రామ్‌తో మసాలా, పవన్ కళ్యాణ్‌తో గోపాలా గోపాలా, వరుణ్ తేజ్‌తో ఎఫ్2, మేనల్లుడు నాగచైత్యన్యతో వెంకీమామ ఇలాంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాయి.
ఇటీవల ఓటీటీలో విడుదలైన నారప్ప, దృశ్యం-2 చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 35 ఏండ్లకు పైగా సినీ ప్రయాణంలో 73 చిత్రాలలో నటించిన విక్టరీ వెంకటేష్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఆయన ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ.. వెంకటేష్‌కు ఇండియా హెరాల్డ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి