చిత్రసీమలో మరీ ఎక్కువగా మరణాలు సంభవించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఎంతో పెద్ద సెలబ్రిటీలను కోల్పోయిన చిత్రసీమ ఇప్పుడు మరో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులను కూడా కోల్పోవడం బాధాకరంగా అనిపిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం హెచ్.సి.యు రోడ్డులో వేగంగా దూసుకెళ్లిన కారు ఏకంగా ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను బలితీసుకుంది. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.


చెట్టును ఢీకొనడంతో ఏకంగా చెట్టు కూడా డ్యామేజ్ అవ్వడం..అక్కడి దృశ్యాలను చూస్తే కారు ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఆక్సిడెంట్ లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్. మానస, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎన్. మానస తోపాటు విజయవాడకు చెందినటువంటి బ్యాంకు ఉద్యోగి అయిన అబ్దుల్ రహీం ఆక్సిడెంట్ స్పాట్ లోని ప్రాణాలు కోల్పోయారు. మద్యం సేవించి బండి నడపకండి అని ఎంత హెచ్చరించినప్పటికీ ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు..


అర్ధరాత్రి వరకూ పీకలదాకా తాగడం.
ఆ తర్వాత రోడ్ ఎక్కి.. మత్తులో ఏం చేస్తున్నారో తెలియక ప్రాణాలు కోల్పోవడం.. మద్యం తాగి కారు వేగంగా దూసుకెళ్లి చెట్టును ఢీకొనడంతో ఈ ముగ్గురు కూడా ప్రాణాలను కోల్పోయారు. ఎమ్. మానస వయసు 22 సంవత్సరాలు ఉండగా.. ఎన్. మానస వయసు 21 సంవత్సరాలు.అయితే మద్యం సేవించి కారు వేగంగా నడపడం వల్లే మత్తులో కారు యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తేల్చి చెప్పేసారు. వీళ్లు ఉదయం షూటింగ్ కోసం జె వి కాలనీ లో ఉండే సాయి సిద్ధూ అనే మరొక జూనియర్ ఆర్టిస్ట్ ఇంటికి అమీర్ పేట నుంచి రావడం జరిగింది. నలుగురు సాయి సిద్దు ఇంట్లో మద్యం సేవించి టీ తాగేందుకు  లింగంపల్లి  అలిండ్ కంపెనీ వైపు వెళ్తుండగా ఈ కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఇకపోతే సిద్ధుని ఆస్పత్రికి తరలించారు.. మిగతా ముగ్గురు మృతదేహాలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: