టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరో గా తన సత్తా చాటుతూ రోజు రోజుకు మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు హీరో సత్యదేవ్. తొలుత సహాయక నటుడిగా సినిమాలలో నటిస్తూ నటుడిగా గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ను ఏర్పరుచుకున్నాడు. అలా బ్లఫ్ మాస్టర్ చిత్రంతో ఒక్కసారిగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో ఆ తర్వాత వరుస మంచి హిట్ సినిమాలతో అందరిని మెప్పిస్తూ వస్తున్నాడు.

ఆ విధంగా సత్యదేవ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా లకు మంచి బజ్ ఏర్పడుతుంది. ఫ్యాన్ బేస్ కూడా బాగా ఏర్పడడంతో ఇమేజ్ పరంగా ఆయనకు ఎటువంటి డోకా లేకుండా అయ్యింది. ప్రస్తుతం గాడ్సే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ హీరో. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా ఈ టీజర్లో ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఆయన గతంలో నటించిన సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. 

ఏదేమైనా ఈ సినిమాలోని మంచి పాత్ర పోషిస్తుండగా టీజర్ లో ఆయన చెప్పే ఒక డైలాగు చూస్తే రజనీకాంత్  చెప్పినట్లు గా అనిపిస్తుంది. అయితే దీనిపై కొంతమంది ఆయనను త్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇంత చిన్న స్థాయి యాక్టర్ కు అంత పెద్ద స్థాయి డైలాగ్స్ అవసరమా.. కొన్ని కొన్ని సార్లు ఈ అతి భరించలేకనే ప్రేక్షకులు ఆయన సినిమా కు వెళ్ళడం మానేస్తారు. ఇప్పుడిపుడే ఎదుగుతున్న హీరో కాబట్టి సింపుల్ గా ఉండే సినిమా లు చేయాలి. ఇలాంటి సినిమాలు చేస్తే మొదటికే మోసం వస్తుంది. మరి సత్యదేవ్ ఎందుకు ఆ డైలాగ్ అంతలా చెప్పాల్సి వచ్చిందో చూడాలి.  ఇక గాడ్సే సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు సత్యదేవ్.. ఆ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని తీసుకొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: