ముఖ్యంగా నాని నటనకు పలువురి ప్రముఖుల దగ్గర నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రాహుల్ దర్శకత్వం హీరోయిన్స్ గ్లామర్ ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అవడానికి ప్రధాన కారణం అయింది. అయితే ఈ చిత్రం లో వచ్చే ద్వితీయార్ధంలో కొన్ని సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎప్పుడైతే శ్యామ్ సింగ రాయ్ ఎపిసోడ్ మొదలవుతుందో ఆ ఎపిసోడ్ లో కొన్ని సీన్లు ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ చిత్రానికి ఆయువుపట్టుగా ఉన్న సీన్స్ ను ప్రేక్షకులు మెచ్చే సరికి ఈ చిత్రం అందరికీ బాగా కనెక్ట్ అయి ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవగా మొదటి నుంచి దాన్ని హైలైట్ చేస్తూ వచ్చింది చిత్రబృందం. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా విడుదల చేసి మంచి పని చేసిందని వారికి మంచి కితాబు కూడా ఇప్పుడు వస్తుండడం విశేషం. ఏదేమైనా నాని కి చాలా రోజుల తర్వాత మంచి హిట్ రావడం ఇప్పుడు ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. దానికి తోడు నాని హీరోగా నటించిన గత రెండు సినిమాలు ఓటీటీ లోనే విడుదల అయి అక్కడ ఫ్లాప్ కావడంతో ఈసారి థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సినిమా సూపర్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం హిట్ సాధించి ఇప్పుడు భారీ వసూళ్లు సాధిస్తూ నాని హీరోగా మరో మెట్టు పైకి ఎక్కినట్లు అయ్యింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి