విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది అని గతంలో వార్తలు వినిపించాయి. అయితే పుష్ప పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ ఈ చిత్రాన్ని రోజు రోజుకు పోస్ట్ ఫోన్ చేస్తున్నారు.అయితే ఈ కాంబో ఎప్పుడు సినిమా మొదలు పడుతుందో చూడాలి. నందమూరి బాలకృష్ణ మరియు పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో పైసా వసూల్ అనే సినిమా రాగా ఆ సినిమా విడుదల సమయంలోనే పూరి జగన్నాథ్ తొందరలోనే బాలకృష్ణ తో సినిమా చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికీ కుదరకపోవడంతో ఇప్పటికీ ఆ కాంబో లోని సినిమా అలాగే ఉంది.
వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఐకాన్ అనే సినిమా తెరకెక్కబోతోందని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు పోవడం గమనార్హం. ధనుష్ మరియు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా అనగానే అందరూ ఎంతో రిఫ్రెష్ ఫీల్ అయ్యారు. ఓ సరికొత్త ఈ సినిమా చూడొచ్చు అని భావిస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక పోవడం నిరాశ కలిగిస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓ సినిమా చేయాల్సి ఉండగా అది అనుకోని కారణాల వల్ల క్యాన్సల్ అయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి