టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ అందరిలో కూడా ఆకాశమంత ఎత్తులో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి వంటి భారీ మూవీస్ తరువాత రాజమౌళి తీస్తున్న మూవీ అలానే ఎన్టీఆర్, చరణ్ ఫస్ట్ టైం తమ కెరీర్ లో కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ పై ఈ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని అంటున్నారు విశ్లేషకులు. అయితే అవి మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, ఎన్టీఆర్ కొమరం భీం, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు టీజర్లు ఇలా అన్ని అందరినీ ఎంతో ఆకట్టుకోవడం కూడా కారణంగా చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాని రాజమౌళి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా స్క్రిప్ట్, కథ పక్కాగా అందరినీ ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా తీసారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా జనవరి 7న రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి రెండు రోజుల క్రితం హిందీ మీడియా వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఒక మీడియా వారి ఇంటర్వ్యూ లో భాగంగా తదుపరి మీరు మహేష్ తో చేయనున్న సినిమా గురించి చెప్పండి అంటూ రాజమౌళిని అడిగారు.

అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా ఆర్ఆర్ఆర్ పైనే ఉందని, అయితే మహేష్ మూవీ కూడా ఎంతో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీయాలనే ఆలోచన తనకు ఉందని, కొన్ని నెలల తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తాను అన్నారు రాజమౌళి. అయితే ఈ టాపిక్ మధ్యలో మాట్లాడిన ఎన్టీఆర్, నిజానికి రాజమౌళి గారు సినిమాలు ఎంత బాగా తీస్తారో, టైం కూడా అంతే ఎక్కువ తీసుకుంటారు అని చమత్కరించారు. తన లెక్క ప్రకారం ప్రస్తుతం అంతగా కరోనా ప్యాండెమిక్ పరిస్థితులు లేవు కాబట్టి దాదాపుగా మూడేళ్లు లెక్క వేసుకున్న మహేష్, రాజమౌళిమూవీ 2023 లో మొదలై 2026 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సరదాగా జోస్యం చెప్పారు. అయితే ఒకరకంగా ఎన్టీఆర్ చెప్పిన మాట చాలా వరకు వాస్తవం అయ్యే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు విశ్లేషకులు. మరి ఆ క్రేజీ ప్రాజక్ట్ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: