ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోల ఫోకస్ అంతా మారిపోయింది. వాళ్ళందరూ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ చేస్తున్నారు. కేవలం ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ పై పట్టు సాధిస్తే అక్కడ వచ్చే పాపులారిటీ ఇక్కడ మొత్తం సౌత్ తో సమానం అని భావిస్తుంటారు. దీనికితోడు హిందీ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతాయి కాబట్టి వాటి మార్కెట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇంత కాలం తెలుగు సినిమాలు హిందీలో అనువాదం చేసి విడుదల చేశారు. మన తెలుగులో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉండే సినిమాలను అక్కడ హిందీ జనాలు విపరీతంగా ఆదరిస్తారు. ఇక ఇటీవల బాహుబలి సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే.

సినిమా తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా పెరిగింది. దాంతో ప్రస్తుతం ప్రభాస్ హిందీలో నేరుగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రభాస్ నటించిన సాహో సినిమా అన్ని భాషల్లో ఫ్లాప్ అయిన బాలీవుడ్ లో మాత్రం భారీ వసూళ్లను అందుకుంది. అందుకే ఇప్పుడు మన టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ తమ సినిమాలు హిందీలో విడుదల చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. అయితే హిందీలో ఈ సినిమాకు సరిగ్గా ప్రమోషన్స్ నిర్వహించలేదు అన్న మాట వాస్తవమే.

అయినా కూడా హిందీలో ఈ సినిమా హిట్ అందుకుంది. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా పుష్ప సూపర్ హిట్ సాధించడంతో ప్రభాస్ తర్వాత హిందీలో మార్కెట్ సాధించిన హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. ఇకపై అల్లు అర్జున్ నటించబోయే సినిమాలు ధైర్యంగా హిందీ లో రిలీజ్ చేసుకోవచ్చని పుష్ప వసూళ్లు నిరూపించాయి. ఇక త్వరలో మరో ఇద్దరు హీరోలు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో త్వరలోనే పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ స్టార్ హీరోలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: