టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా పలు భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుని బాగా కలెక్షన్స్ తో ప్రస్తుతం దూసుకెళుతోంది. సుకుమార్ తీసిన ఈ మాస్ రస్టిక్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. తెలుగు మూవీ ఆడియన్స్ తో పాటు ప్రస్తుతం పుష్ప మూవీ ఇతర భాషల ప్రేక్షకులని సైతం ఎంతో ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ సినిమా ఇప్పటికే నార్త్ లో కూడా అదరగొడుతూ ఉండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అమితానందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, మరోవైపు సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించారు. ఇక తన అందచందాలతో పాటు యాక్టింగ్ తో హీరోయిన్ రష్మిక ఆకట్టుకోగా, ఇతర పాత్రధారులు అందరూ కూడా తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి యాక్ట్ చేసారు. ఇక ఈ సినిమాపై ప్రస్తుతం అటు ప్రేక్షకాభిమానులతో పాటు పలు సినిమా పరిశ్రమలకు చెందిన నటులు, సినీ ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తుండగా కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పుష్ప మూవీ గురించి ఎంతో పాజిటివ్ గా తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసారు.

నేడు పుష్ప మూవీ చూసాను, సినిమా ఎంతో అద్భుతంగా ఉంది, ముఖ్యంగా పుష్పరాజ్ గా అల్లు అర్జున్ యాక్టింగ్ ఇరగదీసారు, ఆ విధంగా అంత మాస్ స్టైల్ లో అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ సూపర్. అలానే దర్శకుడు సుకుమార్ సినిమాని ఎంతో రస్టిక్ గా తెరకెక్కించిన తీరు, సినిమాలో దేవిశ్రీ అందించిన సాంగ్స్, బీజీఎమ్ మరొక రేంజ్ లో ఉన్నాయని అంటూ మొత్తంగా పుష్ప పై ప్రశంశల జల్లు కురిపించారు మహేష్ బాబు. ఇక ప్రస్తుతం మహేష్ పోస్ట్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉండడంతో అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ వాటిని మరింతగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: