సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలు తమ కుటుంబాలతో తమ తమ ప్రాంతాలలో గడుపుతూ పండుగను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ దగ్గరి నుంచి నందమూరి కుటుంబం వరకు ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తూ ఈ పండుగ రోజు ను వినోదం గా జరుపుకున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఈ సంక్రాంతి పండుగకు సైతం భారీగా కష్టపడుతూ ఆదర్శం గా నిలుస్తున్నాడు. 

ఆయన హీరో గా పూరీ జగన్నాథ్ దర్శత్వంలో లైగర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. రమ్య కృష్ణ, మైక్ టైశన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కి సంబంధించి గ్లింప్స్ విడుదల కాగా దానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు దీనిని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. టాప్ రేంజ్ హీరో కి ఉన్న క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కు ఈ స్థాయి లో మద్దతు రావడం అంటే మామూలు విషయం కాదు. 

అలా ఆయన స్టార్ డం కు తగ్గ రెస్పాన్స్ వచ్చి సినిమా పై అంచనాలను భారీ గా పెంచింది. బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ చేస్తున్న హార్డ్ వర్క్ చూసి అందరూ ఎంతో ఆశ్చర్య పోతున్నారు. ఈ సినిమా లో దేహదారుఢ్య బాగా కనిపించాలని ఆయన షూటింగ్ గ్యాప్ లో భారీ గా కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పండగ సమయం లో కూడా ఆయన జిమ్ లో కష్టపడుతున్నారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మరి హిట్ కొట్టి చాలా రోజులవుతున్న నేపథ్యం లో విజయ్సినిమా తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: