ఇటీవలి కాలంలో స్టార్ హీరోలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త డిఫరెంట్ గా విభిన్నమైన పాత్రలు ట్రై చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి సినిమాలో ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మొన్నటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్గా కొనసాగాడు అల్లు అర్జున్.లవర్ బాయ్ గా కనిపిస్తూ స్టైలిష్ లుక్లో ప్రేక్షకులు అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇక సినిమాలో అల్లు అర్జున్ ని చూశారు అంటే వావ్ అల్లు అర్జున్  ఎంత స్టైల్ గా ఉన్నాడు అనుకుంటూ.. అచ్చం అల్లు అర్జున్ లాగానే హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం లాంటివి చేసేవారు అభిమానులు. అలాంటి లవర్ బాయ్ అల్లు అర్జున్ కాస్త పుష్ప సినిమాలో ఏకంగా ఒక లారీ డ్రైవర్ పాత్రలో మాసిన బట్టలతో చింపిరి జుట్టుతో పొడవాటి గడ్డంతో కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలా నటిస్తాడో అని అనుకున్నారు. కానీ తన అద్భుతమైన నటనతో   అదరగొట్టాడు ఈ సినిమాలో అల్లు అర్జున్. నటనలో ఒక మెట్టు ఎక్కాడు అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప  రాజ్ పాత్రకి ఒక ప్రత్యేకమైన మేనరిజం ఉంటుంది.. ఒకభుజం పై కెత్తి ఉంచుతాడు అల్లు అర్జున్.  సినిమా మొత్తం అలాగే కొనసాగిస్తూ ఉంటాడు. అయితే సినిమాలో అలా అల్లు అర్జున్ భుజంపైన కి ఎందుకుపెడతాడు అన్నది తెలియదు కానీ.. అది అల్లు అర్జున్ మేనరిజం  అన్నది మాత్రం ప్రేక్షకులకు అర్థమైంది.


 ఇక పుష్ప సినిమా చూసిన తర్వాత అచ్చం అల్లు అర్జున్ మేనరిజాన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు ఎంతోమంది అభిమానులు. ఇకపోతే ఇటీవలే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అల్లు అర్జున్ మేనరిజం పై ఒక పంచ్ వేసాడు. ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో భాగంగా హైపర్ ఆది పుష్ప సినిమాపై స్పూఫ్ చేసాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ లాగా ఒక భుజం పై కెత్తి నడుచుకుంటూ వస్తాడు హైపర్ ఆది.. అన్న ఏమైందన్నా భుజానికి అలా పైకి పెట్టావు  అంటూ పక్కన ఉన్న కమెడియన్ అడగడంతో.. అదా ప్రతిరోజు ఫోన్ మాట్లాడి మాట్లాడి భుజం అలాగే పైనఉండిపోయింది అంటూ హైపర్ ఆది పంచ్ వేయడంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: