ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఇండస్ట్రీలో కి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే తాము నటించిన మొదటి సినిమాతోనే మంచి అవకాశాలను దక్కించుకుంటారు, ఆ సినిమాలో వారు నటించింది చిన్న పాత్రలోనే అయినప్పటికీ అందులో వారి నటనకు అలాగే అందచందాలకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో అలాంటి హీరోయిన్ లు తమ సినిమాలో ఉంటే తమ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తారు అనే ఉద్దేశంతో  చిత్ర దర్శక, నిర్మాతలు వారికి అవకాశాలను ఇస్తూ ఉంటారు, ఇలా తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమాతో వేసా క్రేజీ ఆఫర్ లను తప్పించుకుంటున్న ముద్దుగుమ్మ దక్ష నగర్కార్.

ఈ ముద్దుగుమ్మ తేజ  సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జాంబి రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మది చిన్న పాత్రే అయినప్పటికీ ఈ సినిమాలో దక్ష నగర్కార్ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి,  ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది, ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో క్రేజీ హీరో అయిన రవితేజ సరసన నటించే అవకాశాన్ని కూడా ఈ ముద్దుగుమ్మ దక్కించుకున్నట్లు తెలుస్తోంది, సుదీర్ వర్మ  దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కబోతున్న రావణాసుర సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన హీరోయిన్ గా కాకుండా ప్రతినాయక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది, ఇలా కెరియర్ ప్రారంభంలోనే ప్రతినాయక లాంటి పవర్ఫుల్ పాత్రలో నటించబోతోంది అని తెలియడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ఇప్పటి నుండి క్రేజ్ పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: