తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జయరాజ్ గతంలో ఎలాంటి మ్యూజిక్ అందించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని తమిళ చిత్రాలు కూడా తెలుగులో డబ్ అయ్యి మ్యూజికల్ గా మంచి హిట్స్ అందుకున్నాయి.ఇక తెలుగులో వాసు, ఘర్షణ వంటి సినిమాలతో సంగీతాన్ని అందించి ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశాడు. ముఖ్యంగా రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా మ్యూజిక్ పరంగా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చివరగా మహేష్ బాబు స్పైడర్ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ తెలుగు హీరోలు అతనితో సినిమా చేయలేదు.ఇక మళ్ళీ ఇన్నాళ్లకు హ్యారీస్ జయరాజ్ తెలుగు సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొదటిసారి నితిన్ సినిమా కోసం పనిచేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ 'అపరిచితుడు' మ్యూజిక్ డైరెక్టర్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అభిమానులు ప్రశ్నించినప్పుడు నితిన్ తదుపరి సినిమాకి తాను సంగీతం అందిస్తున్నట్లు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో వెల్లడించడం జరిగింది. 

'కిక్' కథ రచయిత ఇంకా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ' డైరెక్టర్ వక్కంతం వంశీ నితిన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.'కిక్', 'రేస్ గుర్రం', 'సింబా' ఇంకా అఖిల్ అక్కినేనితో రాబోయే 'ఏజెంట్' వంటి చిత్రాలకు కథను అందించిన వంశీ డైరెక్టర్ గా తన మొదటి సినిమాను అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే టైటిల్ తో చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలువగా మరో సినిమా అవకాశం కోసం చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇక 2021లో చెక్, 'రంగ్ దే' ఇంకా 'మాస్ట్రో' అనే సినిమాలతో ప్లాప్స్ చూసిన నితిన్ తన తదుపరి మూవీ 'మాచర్ల నియోజకవర్గం' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి MS దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో యూత్ స్టార్ నితిన్ కి జోడీగా కృతి శెట్టి ఇంకా అలాగే కేథరిన్ థెరిస్సా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే వక్కంతం వంశీ సినిమాపై నితిన్ ఇంకా ఆఫీషియల్ గా క్లారిటీ అనేది ఇవ్వాల్సి ఉంది. ఇక ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఆ సినిమా యూనిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా హారిస్ జై రాజ్ ను ఫైనల్ చేయడం జరిగింది.ఇక తెలుగులో కంబ్యాక్ కోసం హ్యారీస్ జయరాజ్ ఈ సినిమాపై కసరత్తులు మొదలు పెట్టే ప్రయత్నంలో వున్నాడని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: