గతవారం సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తన తెలివితేటలతో కార్నర్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తన ఫోకస్ ను టిక్కెట్ల రేట్ల వ్యవహారం నుండి మెగా ఫ్యామిలీ పై పెట్టాడు. సాధారణంగా అర్థరాత్రి వరకు ఒడ్కా తాగుతూ మంచి కిక్ మీద ఉండే వర్మ ఆ అర్థరాత్రి సమయంలో ఎదో ఒక ట్విట్ పెట్టకుండా అతడికి నిద్రపట్టదు అంటారు.


అయితే అర్థరాత్రి సమయంలో ఆవేశంతో చేసిన ట్విట్స్ ను తెల్లవారి తన మత్తు దిగిపోయాక డిలీట్ చేయడం వర్మ అలవాటు ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ గురించి ట్విట్ చేస్తూ ‘ALLU is the new MEGA’ అంటూ ట్విట్ చేసి తెల్లవారి మళ్ళీ ఆ ట్విట్ ను డిలీట్ చేసాడు.


అంతేకాదు భవిష్యత్ లో మెగా యంగ్ హీరోలు అందరూ తామందరం అల్లు అర్జున్ చుట్టాలు అని చెప్పుకోవలసిన రోజులు వస్తాయి అంటూ ఇన్ డైరెక్ట్ గా బన్నీని ఆకాశంలోకి ఎత్తేస్తూ చేసిన కామెంట్స్ కూడ సోషల్ మీడియా నుండి తొలగించాడు. దీనితో ధైర్యంలేక రామ్ గోపాల్ వర్మ ఇలా ప్రవర్తించాడ అంటూ కొందరు వర్మ పై సెటైర్లు వేస్తున్నారు.


లేటెస్ట్ గా ధనుష్ తాను తన భార్యతో విడాకులు తీసుకుంటున్నాను అంటూ లీక్ చేసిన విషయం పై వర్మ తనదైన స్థాయిలో వెరైటీగా స్పందించాడు. తాను ఎప్పటి నుండో ఎవర్నీ పెళ్ళి చేసుకోవద్దని చెపుతూనే ఉన్నానని అయితే తన మాట ఎవరు వినరు అంటూ జోక్ చేసాడు. అంతేకాదు ఇప్పటికైనా పెళ్ళి అంటే వేస్ట్ అన్నవిషయాన్ని ధనుష్ తెలుసుకున్నందుకు అతడికి అభినందనలు తెలియచేసాడు. అయితే పెళ్ళి చేసుకున్న తరువాత 18 సంవత్సరాలకు ధనుష్ కు తన భావాలు తన భార్య భావాలతో కలవవు అన్నవిషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ మరికొందరు ధనుష్ ను అదేవిధంగా వర్మను ట్రోల్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: