కన్నడ భామ రష్మిక మందన్న అక్కడ కిరిక్ పార్టీ మూవీతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకోగా ఆ తర్వాత టాలీఎవుడ్ లో ఛాన్స్ అందుకుంది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మికసినిమా తోనే ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ ఏర్పరచుకుంది. అక్కడి నుండి అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస ఛాన్సులు అందుకుంద్ది. ఛలో టు పుష్ప రష్మిక కెరియర్ గ్రాఫ్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. చేస్తున్న ప్రతి సినిమా విషయంలో అమ్మడు తీసుకునే జాగ్రత్తలే ఆమెని ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయని చెప్పొచ్చు.

పుష్ప సినిమా లో శ్రీవల్లి పాత్రలో రష్మిక డీ గ్లామరస్ గా కెరియర్ లో మొదటిసారి అలా కనిపించి మెప్పించింది. సినిమాలతోనే కాదు రష్మిక మందన్న ఖాళీ టైం లో ఫోటో షూట్స్ తో కూడా ఆడియెన్స్ ని అలరిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు శారీ లుక్ తో అందమనే ఇదే అనేలా కనిపించింది. శ్రీవల్లి లేటెస్ట్ శారీ పిక్స్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఇట్టా అందంగా ఉంటే ఎట్టా అమ్మి అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇష్టపడే దాని అందం మీరు చేసే పనిగా ఉండనివ్వండి అంటూ రుమి కొటేషన్ కూడా ఇచ్చింది రష్మిక మందన్న.

తెలుగులో అమ్మడి ఫాం చూస్తుంటే మరో ఐదేళ్లు వరుస సినిమాలతో బిజీగా ఉండేలా ఉంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా రష్మిక తన ఛాన్సులతో అక్కడ భామలకు కూడా షాక్ ఇస్తుంది. ప్రస్తుతం హిందీలో రెండు భారీ ప్రాజెక్టులు చేస్తుంది రష్మిక. సో చూస్తుంటే అక్కడ కూడా రష్మిక తన హవా కొనసాగించాలని చూస్తుందని చెప్పొచ్చు. కన్నడ నుండి వచ్చిన రష్మిక సౌత్ అన్ని భాషల్లో దుమ్ముదులిపేస్తుంది. చూస్తుంటే అమ్మడు తన పాపులారిటీని మరింత పెంచుకోబోతుందని మాత్రం అర్ధమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: