స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ సినిమా అలవైకుంఠపురములో. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలపై అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీగా నిర్మించారు. 2020 సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఈ సినిమాతో హీరోగా అల్లు అర్జున్ ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అయితే ఏకంగా నేషనల్ వైడ్ గా పాపులర్ అవ్వడం, అలానే అటు బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ సహా అలవైకుంఠపురములో టీమ్ మొత్తానికి కూడా ఎంతో బాగా క్రేజ్ తెచ్చిపెట్టడం జరిగింది. ఇక ఈ సినిమాని ఇటీవల షెజాదా పేరుతో హిందీ లో రీమేక్ చేస్తున్నారు అల్లు అరవింద్. కొన్నాళ్ల క్రితం షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అయితే మధ్యలో అలవైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వర్షన్ రైట్స్ సొంతం చేసుకున్న గోల్డ్ మైన్స్ సంస్థవారు, డబ్బింగ్ వర్షన్ ని త్వరలో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు మొన్న ప్రకటించారు.

ఒకవేళ అదే జరిగితే షెజాదా సినిమా పై అది ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన అల్లు అరవింద్, గోల్డ్ మైన్స్ సంస్థ వారితో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. దానితో అల హిందీ డబ్బింగ్ వర్షన్ థియేట్రికల్ రిలీజ్ ఆగిపోయింది. ఈ విషయమై కొంత నిరాసక్తతకి లోనైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో జోష్ నింపేలా ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ని ఫిబ్రవరి 6న తమ సంస్థకు చెందిన దించాక్ ఛానల్ లో ప్రసారం చేయబోతున్నట్లు నిన్న ప్రకటించారు గోల్డ్ మైన్స్ సంస్థ వారు. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా అక్కడ హిందీ డబ్బింగ్ వర్షన్ ఎంత మేర ఆదరణ అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: