సమంత.. ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా రూమర్స్ కి కూడా గురి అయింది. ఆ తర్వాత హీరో సిద్ధార్థతో ప్రేమాయణం నడుపుతోంది అని వీరు చేసిన కొన్ని చేష్టల వల్ల ప్రేక్షకులు గట్టిగా విశ్వసించారు.. ఏ పార్టీ కి వెళ్ళినా .. ఫంక్షన్ కి వెళ్ళినా కలిసి వెళుతూ ఉండడంతో మీడియా మొత్తం వీరిపైన ఫోకస్ చేయడం గమనార్హం.. వారిద్దరి మధ్య ఏమీ లేదని నిరూపించడానికి సమంత , నాగ చైతన్య తో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది.. దాంతో ఆమెపై వస్తున్న రూమర్స్ సద్దుమణిగి ఇక వీరిద్దరిపై రూమర్స్ రావడం మొదలయ్యాయి.. ఎట్టకేలకు ఆమె నాగ చైతన్య ను వివాహం చేసుకొని అక్కినేని వారి కోడలు గా చలామణి అయింది.

అయితే నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఎవరి ప్రపంచంలో వారు జీవిస్తున్నారు. హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమంత ఐటమ్ సాంగులకు నో చెప్పిన విషయం మనకు తెలిసిందే.. కానీ విడాకుల తర్వాత పుష్ప  సినిమాలో ఐటెం సాంగ్ ఉ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావా.. అంటూ మాస్ స్టెప్పులేసి కుర్రకారును నిద్ర లేకుండా చేయడమే కాకుండా మంచి రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఒక స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్లో మెరవడం అందరికీ షాక్ అయినప్పటికీ ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.


గత రెండు మూడు రోజుల నుంచి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్  సినిమాలో సమంత  ఐటమ్ సాంగ్ చేయబోతోంది అనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. అంతేకాదు చిత్రబృందం సంప్రదించడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే వార్తలు కూడా వచ్చాయి.. కానీ తాజాగా ఈ చిత్రం యూనిట్ స్పందిస్తూ ఇలాంటి రూమర్స్  నమ్మ వద్దు అని సమంత ఐటమ్ సాంగ్లో నటించడం లేదు అని బాలీవుడ్ భామ కోసం వెతుకుతున్నామని అధికారికంగా ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: