సాధారణ మహిళ అయినా, పెద్ద సెలబ్రిటీ అయినా, వ్యాపార వేత్త అయినా, పోలీస్ ఆఫీసర్ అయినా ఒక మహిళ భార్యగా మారి తల్లి కాబోతుంది అంటే తన జీవితంలో ఎన్నో విజయాలు, ఎంతో ఉన్నతి ఉన్న ఆ ఒక్క అనుభూతి ముందు అన్ని తక్కువైపోతాయి అన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం అలాంటి ఆనందం లోనే మునిగి తేలుతోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. కాజల్‌ గర్భవతి అని ఇటీవల ఆమె భర్త గౌతమ్‌ కిచ్లు కన్ఫార్మ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం విన్న ఆమె అభిమానులు సంతోషంతో ఉరకలు వేస్తున్నారు.

త్వరలో మన అందరి ప్రపంచంలోకి బుల్లి కాజల్ అగర్వాల్  ప్రిన్సెస్ తమ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఇక కిచ్లు అయితే కాజల్ పై పూర్తి దృష్టిని కేంద్రీకరించి రాబోయే తన బేబీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఓ డాక్టర్‌ను కూడా ప్రత్యేకంగా భార్య కోసం నియమించి ఈ ‘ప్రీ న్యాటల్‌ క్లాసెస్‌ ద్వారా డెలివరీ వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుంటున్నారు. దాంతో ఈమె ప్రస్తుతం షూటింగ్స్ కి దూరం గా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజా సమాచారం మేరకు కాజల్ చిరు నూతన ప్రాజెక్ట్ లో ఓ గెస్ట్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆమె షూటింగ్ కి హాజరు కాబోతున్నట్లు సమాచారం. మంచి పాత్ర అందులోనూ, తక్కువ షెడ్యులే కావడంతో భర్త గౌతమ్ ను ఒప్పించి డాక్టర్ల పర్యవేక్షణలో షూటింగ్ కి హాజరు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఏమిటన్నది ఇంకా కంఫర్మ్ కాకపోయినా చిరు పక్కన కాజల్ అంటే ఆ జోష్ వేరే లెవెల్. మరి ఈ వార్తలో ఎంత మాత్రం నిజముంది అనేహ్ది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: