కరోనా పుణ్యమా అని అన్ని పరిశ్రమల లాగే సినిమా పరిశ్రమ కూడా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా చిన్న సినిమాలను నిర్మించుకునే నిర్మాతలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా పెద్ద సినిమాలు సైతం భారీ బడ్జెట్ లతో నిర్మించి కరోనా వేళలో థియేటర్ లు లేకుండా విడుదల చేయలేక, తక్కువ మొత్తం ఇచ్చే ఓ టి టి ప్లాట్ ఫామ్ లకు ఇవ్వలేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కాస్త పరిస్థితి సర్దుమణగడంతో భారీ బడ్జెట్ చిత్రాలు అన్నీ విడుదల కావడానికి సిద్ధపడుతున్నాయి. అందులో ఈ రోజు ఏకంగా ఆర్ ఆర్ ఆర్, భీమ్లా నాయక్ మరియు ఎఫ్ 3 సినిమాల రిలీజ్ డేట్స్ ను అధికారికంగా ప్రకటించాయి.

మాములుగా అయితే ఇవి ఎప్పుడో రిలీజ్ కావలసి ఉంది. అలా పలు వాయిదాల తర్వాత ఈ డేట్ లను ప్రకటించాయి. అనిల్ రావిపూడి, దిల్ రాజ్, వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల కలయికలో రూపుదిద్దుకున్న ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందుకే దానికి కొనసాగింపుగా సినిమా తీయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తప్పించి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కూడా అదే కాస్ట్ ను కొనసాగించారు. అనిల్ రావిపూడి మంచి కంటెంట్ ఉన్న కామెడీ సినిమాలను తీయడంలో దిట్ట. ఇందులోనూ తమన్నా మరియు మెహ్రీన్ ఫిర్జాదాలు హీరోయిన్ లుగా చేయనున్నారు.

ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పరిస్థితులు బాగుంటే అనుకున్న డేట్ కే ఈ సినిమా విడుదల కానుంది.  మరి ఈ సినిమాలో మరెన్ని నవ్వులను పూయించనున్నారో అన్నది తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే. ఇది అటు మెగా అభిమానులకు మరియు నారప్ప అభిమానవులకు శుభవార్త అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: