అక్కినేని హీరో సుమంత్ మళ్ళీ రావా సినిమా తర్వాత అంతటి విజయాన్ని ఏ సినిమా తనకు అందించలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ మొదలైంది అనే సినిమా టైటిల్ తో డైరెక్టర్ కీర్తి కుమార్ ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా నైనా గంగూలీ నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ కూడా విడుదల అవ్వడం జరిగింది. ఈ టీజర్ చూస్తే ఈసారి సుమంత్ మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తోంది.

ఇక టీజర్ విషయానికి వస్తే విడాకులు తీసుకోబోతున్న ఓ యువకుడు తరపున న్యాయవాది తోనే ఆ హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పలు ఫోటోలు , వీడియోలు బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీని నేరుగా ఓటిటీ లోనే విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్రబృందం. ఇక ఈ సినిమా ఈ నెల 11వ తేదీన జి5 లో విడుదల అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి  ట్రైలర్ ను వెంకటేష్ సోషల్ మీడియాలో విడుదల చేయడం విడుదల చేసి.. ఆ సినిమా టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఇక హీరో విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితంలో జరిగే కొన్ని పరిణామాలు ఈ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి. ఇందులో సుమంత్ సరసన వర్షిణి, సౌందర్ రాజన్ నటిస్తున్నారు. ఇక ఇందులో మరొక హీరోయిన్ నైనా లాయర్ గా నటిస్తోంది. ఇక ఈ లాయర్ తో హీరో ప్రేమలో పడే సన్నివేశాలు ఈ సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయి. ఇక ఇందులో అలనాటి హీరోయిన్ సుహాసిని, ఘట్టమనేని మంజుల, పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సారి మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: