భారత చలనచిత్ర పరిశ్రమలో ఎందరో గొప్ప గొప్ప నటీనటులు, దర్శకులు ఉన్న అందరికీ అన్ని దక్కవు అనే చందాన చాలామంది తమ ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించకుండా నే కొందరు తెరమరుగు అయ్యారు, మరికొందరు తమకు తామే స్వయంగా పరిశ్రమకు దూరం అయ్యారు , ఇంకొందరు ఎన్నో అద్భుతమైన ఘనతలు సొంతం చేసుకున్నారు. 



ఒక నటుడు తన నట జీవిత కాలంలో మంచి గుర్తింపు ఉండే పాత్రలు దక్కాలని కోరుకుంటాడు. ఒక వేళ అలాంటి పాత్రలు దక్కిన ఏ చేతనో  సరిగ్గా ఆ పాత్రను పోషించ లేకపోయినా, ప్రేక్షకులు తన నటనను మెచ్చుకోకపోయిన అతను మానసికంగా పడే వ్యధ చెప్పలేనిది. అందుకే కొన్ని తనకు నటించేందుకు మంచి పాత్రలు వచ్చిన కొన్నిసార్లు సంకోచిస్తూ నిరాకరించగా , కొన్ని సార్లు మాత్రం అటువంటి పాత్రలు చేయడానికి మొదట భయపడి న తర్వాత అందులో లీనమై అద్భుతంగా పాత్రను పండిస్తారు. 


అలాంటి జాబితాలోకి వచ్చే నటుల్లో మన టాలీవుడ్ మ్యాన్లీ స్టార్ జగపతిబాబు కూడా ఇదే కోవలోకి వస్తారు. నటుడిగా సుదీర్ఘ కాలం ప్రయాణిస్తున్న జగపతి 90 వ దశకంలో ఆయన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిన మరుపురాని హిట్లు గురించి మాట్లాడితే ఎంతైనా చెప్పుకోవచ్చు.ఆరోజుల్లో ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి తనకు కాబోయే భర్త గురించి ఆలోచిస్తే ముందుగా గుర్తుకు వచ్చేది జగపతి బాబు అంటే అతిశయోక్తి కాదు. హీరో శోభన్ బాబు తర్వాత అత్యధిక సంఖ్యలో మహిళా అభిమానులు కలిగిన నటుడు గా ఇప్పటికీ జగపతిబాబు మంచి గుర్తింపు ఉంది. 



తర్వాత కాలంలో కొన్ని పరాజయాలు రావడంతో హీరో నుండి విలన్ గా మారి లెజెండ్ ద్వారా మెగా హిట్ అందుకున్న జగపతిబాబు ఇంక కెరీర్ లో వెనకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా జగపతి బాబు హీరోగా కంటే అత్యంత బిజీగా మారిపోయిన విషయం తెల్సిందే. 


జగపతి బాబు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఘనత సాధించారు. అదేంటిటిది అంటే తన తరం హీరోలతో పాటుగా తన తర్వాత తరం హీరోలతో కలిసి నటించిన ఏకైక నటుడిగా నిలిచారు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ లలో సైతం అక్కడి సూపర్ స్టార్స్ నుంచి ప్రస్తుత యువతరం హీరోల దాకా కలిసి నటించిన ఘనత ఒక్క జగపతిబాబు కే దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: