దర్శకుడు
కొరటాల శివ భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆయనతో సినిమాలు చేయాలని పెద్ద హీరోలు సైతం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. తొలి
సినిమా నుంచి ప్రేక్షకులను అలరించే విధంగా భారీ స్థాయిలో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కొరటాలశివ. ఇప్పుడు ఏకంగా
మెగాస్టార్ చిరంజీవి తో ఆయన
సినిమా చేయడం పట్ల ఆయన అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు
ప్రస్తుతం
ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న
కొరటాల శివ ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం పూర్తి చేసి వచ్చే ఏడాది మొదటి భాగం లోనే విడుదల చేయాలన్నది ఆయన ప్లాన్. ఆ విధంగా ఆచార్య సినిమాకు అనవసరంగా ఎక్కువ సమయాన్ని కేటాయించిన
కొరటాల శివ ఈ చిత్రాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నాడు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వార్తల ప్రకారం
కొరటాల శివ తన తదుపరి
సినిమా రామ్ చరణ్ తో చేయబోతున్నాడు అని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో
సినిమా వచ్చే విధంగా కొన్ని ప్రయత్నాలు జరగగా చివరి దశ లో ఆయనకు సరైన కథ కుదిర లేదని చెప్పి
కొరటాల శివ చిత్రం నుంచి తప్పించుకున్నారు. ఇన్నాళ్ళకు మళ్ళీ వీరి కాంబినేషన్లో
సినిమా సెట్ అవ్వడం అందరినీ ఎంతగానో సంతోషపరుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
కొరటాల శివ ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో చేసాడు రామచరణ్. సోలో గా హీరోగా ఇంత వరకు నటించ లేదు. ప్రస్తుతం
రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ షూటింగ్ శేరావేగంగా జరుపుకుంటుంది. ఆ తర్వాత గౌతం తిన్ననురి
సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని అయన మొదలుపెదతాడట.