అయితే మొన్నటి వరకు లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉన్నా సీనియర్ హీరో రవితేజ ఇప్పుడు మాత్రం ఇద్దరు హీరోయిన్లకు లిప్ లాక్ పెట్టేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో లిప్ లాక్ సీన్ లో అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ క్రమంలోనే ఈ సన్నివేశాల గురించి హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... రెండవ సినిమాలోని రవితేజ తో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఇటీవల సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ.. రెండో సినిమాను రవితేజ గారితో చేస్తా అని అస్సలు ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆయన టైమింగ్ సూపర్ గా ఉంటుందని దీంతో తెలుగు రాని నేను కాస్త ఇబ్బంది పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ కంగారు పడొద్దు అంటూ రవితేజ కంఫర్ట్ ఇచ్చారని.. లిప్ లాక్ సీన్లు కథకు అవసరం కాబట్టే చేశాను అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ . ఇలా లిప్ లాక్ ఇంటిమేట్ సీన్లలో నటించేందుకు నేను రెడీ గా ఉన్నాను అంటూ చెబుతోంది. పాత్రకు అవసరమైతే ఇలాంటి సన్నివేశాలు నటిస్తాను అంటూ చెబుతోంది. ఇక డింపుల్ హయాతి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది మీనాక్షి చౌదరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి