టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్ ఎవరు అంటే
విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. ఎవరికీ సాధ్యం కాని విధంగా భారీ స్థాయిలో ఇమేజ్ అందుకుని ఇప్పుడు అగ్ర హీరోగా
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వెలుగొందుతున్నాడు. పాన్
ఇండియా హీరోగా కూడా భారీ స్థాయిలో ఎలివేట్ అయ్యే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. చిన్న హీరోగా ఉన్న
విజయ్ దేవరకొండ ఇప్పుడు పాన్
ఇండియా మార్కెట్ లో భారీ స్థాయిలో ఇమేజ్ అందుకోవడం నిజంగా పెద్ద సెన్సేషనల్ న్యూస్ అని చెప్పాలి.
ఆయన ధైర్యం ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల వరస ను పెట్టి తెలుస్తుంది. దర్శకులు సైతం ఆయన
మార్కెట్ ను చూసి ఆశ్చర్యపోయి ఆయనతో సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాను పూర్తి చేసిన
విజయ్ దేవరకొండ తొందర్లోనే అదే దర్శకుడితో కలిసి జనగణమన అనే సినిమాను మొదలు పెట్టబోతున్నారు. మార్చిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది.
పూరి జగన్నాథ్ సినిమాలు ఎలా చేస్తాడో అన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన ఓ సినిమాను మొదలు పెడితే తక్కువ కాలంలోనే పూర్తి చేస్తాడు.
అలా వెంట వెంటనే ఇద్దరూ ప్రాజెక్టులు చేయటం
సినిమా వారిని ఎంతగానో ఆసక్తి పరిచింది. ఒకవైపు
సుకుమార్ దర్శకత్వంలో ఓ
సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం కూడా పాన్
ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప సినిమాతో
సుకుమార్ కు భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రావడం నిజంగా అందరినీ మరింత ఆసక్తి పరిచింది అని చెప్పవచ్చు. మరి వరుసగా పెద్ద దర్శకులతో సినిమాలు చేసుకుంటూ పోతున్న
విజయ్ దేవరకొండ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఈ సినిమాలో చేసిన తర్వాత ఆయన యొక్క స్థాయి క్రేజ్ పాపులారిటీ ఏ రేంజ్ లో దక్కించుకుంటాడో చూడాలి.