ఇండస్ట్రీలో ఏ ఎన్ ఆర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సమయంలో సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీకి బిగ్ బాస్ గా మారిపోయాడు. విలన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఇక ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ గా మారిపోయాడు. దాదాపు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ లో మకుటం లేని మహారాజుగా కొనసాగాడు మెగాస్టార్ చిరంజీవి. ఒకరకంగా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు అని చెప్పాలి.


 1978 లో పునాది రాళ్లు అనే సినిమాతో చిరంజీవి కెరీర్కు పునాది పడింది. ఇక ఆ తర్వాత ఖైదీ సినిమాతో ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు చిరంజీవి. ఖైదీ సినిమా తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇక ఇప్పుడు ఎంతోమంది మెగా ఫ్యామిలీలో హీరోలకు లైఫ్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇకపోతే చిరంజీవి హీరోగా మంచి జోరు మీద ఉన్న సమయంలోనే అప్పటి స్టార్ హాస్యనటుడు అల్లు రామలింగయ్య ముద్దుల కూతురు  సురేఖను పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 20, 1980లో వీరి వివాహం జరిగింది.


 ఇక చిరంజీవి సురేఖ పెళ్లి జరిగి దాదాపు 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇక చిరంజీవి సురేఖ వివాహానికి సంబంధించిన పెళ్లి ఫోటో శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే నూతన్ ప్రసాద్ తో కలిసి నటిస్తున్న తాతయ్య ప్రేమ లీలలు సినిమా షూటింగ్లో చిరంజీవి పాల్గొన్న సమయంలో షర్ట్ చినిగిపోయింది. అదే సమయంలో అక్కడి నుంచి అలాగే మండపానికి వెళ్లిన చిరంజీవి ఇక చిరిగిపోయిన షర్ట్ తోనే సురేఖా కి తాళి కట్టడం జరిగింది. ఇదే విషయాన్ని చిరంజీవి ఇంటర్వ్యూలో కూడాచెప్పారు. ఇకపోతే  ఇప్పుడు 60 ఏళ్లు దాటి పోతున్నప్పటికీ కుర్ర హీరోలతో పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు చిరంజీవి..

మరింత సమాచారం తెలుసుకోండి: