కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు రాబడుతోంది అన్న విషయం తెలిసిందే అయితే బాహుబలి సినిమా తో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఆకాశమే హద్దుగా సాగిపోతూ ఉండడం గమనార్హం. ఈ ఏడాది .. ఆ ఏడాది అని సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ఇకపోతే అప్పట్లో కేవలం రూ.60 కోట్ల నుంచి కేవలం రూ. 65 కోట్ల వరకు బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడది రూ. 100 కోట్లకు దాటిపోయింది.. కారణం బాహుబలి 2 సినిమా అని చెప్పవచ్చు.

ఇప్పటివరకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా బాహుబలి 2 టాప్లో నిలబడింది. ఇకపోతే ప్రీమియర్స్ ద్వారా ఓవర్సీస్లో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాము.

1. బాహుబలి 2:బాహుబలి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 సినిమా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు సృష్టించింది. తెలుగుతో సహా అన్ని భాషలలో ఏకంగా రూ.352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు సృష్టించింది. ఇక ఓవర్సీస్ ప్రీమియర్ ద్వారా ఏకంగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం గమనార్హం.

2. అజ్ఞాతవాసి:
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా రూ.124.6 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా యూఎస్ ప్రీమియర్ ద్వారా 1.51 మిలియన్ డాలర్లను వసూలు చేయడం గమనార్హం.

3. బాహుబలి 1:రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగుతో సహా అన్ని భాషలలో రూ.118 కోట్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా యుఎస్లో ప్రీమియర్స్ ద్వారా 1.36 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

ఖైదీ నెంబర్ 150 - 1.29 మిలియన్ డాలర్లు, స్పైడర్ - 1 మిలియన్ డాలర్లు , భరత్ అనే నేను - 850 Kడాలర్లు వసూలు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: