దర్శకుడు ఫణి కృష్ణ ఈ సినిమాతో సరికొత్త దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కాగా ఈ సినిమాలో ఆది సరసన హీరోయిన్ దిగంగన సూర్యవంశి నటిస్తున్నట్లుగా చిత్రబృందం తెలియజేశారు. ఈ సినిమాని హిందీ, తెలుగు భాషలలో విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదట. అయినా కూడా బాలీవుడ్ లో నటిస్తున్న నటి దిగంగన ఈ సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది.
ఇక ఈ సినిమాకి కొంతమంది సీనియర్ టెక్నీషియన్లు కూడా పని చేస్తున్నారు. R.R. ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు. ఇక కెమెరామెన్ గా సతీష్ ముత్యాల బాధ్యతలు చేపట్టారు. ఎడిటర్ గా గిడుతూరి సత్య వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా కోలి పోగు రమేష్ అందిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక మైన విషయాలు త్వరలోనే వెలువడతాయని చిత్రబృందం తెలియజేశారు. మరి ఈ సినిమాతో అయినా ఈ సారి ఈ యువహీరో హిట్ కొడతాడో ఏమో చూడాలి మరి. ఇక ప్రస్తుతం హీరోయిన్ పాయల్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి