ఇక ఈ కార్యక్రమం కూడా ఎంతో సరదా సరదాగా సాగిపోతూ ఎంతో మందికి నవ్వులు పంచుతూ ఉంది. ప్రతివారం సరికొత్త రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ చిరునవ్వుల చిరునామాగా మారిపోయింది ఎక్స్ ట్రా జబర్దస్త్. ఇక జబర్దస్త్ లో ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా రోజా జడ్జి గా ఉంటూ తన నవ్వులతో షో కి మరింత క్రేజ్ తెచ్చిపెడుతుంది అనే చెప్పాలి. ఇక ఇటీవలే జబర్దస్త్ లో భాగంగా సుడిగాలి సుధీర్ స్కిట్ లో భాగం అయింది జబర్దస్త్ జడ్జి రోజా. రోజా తో పాటు అటు ఆమని కూడా స్టేజి మీదికి వచ్చి పర్ఫామెన్స్ చేసింది.
ఇకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్ లో భాగంగా రాంప్రసాద్ అక్కగా రోజా సుడిగాలి సుధీర్ అక్క గా ఆమని చేస్తారు. ఇక మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటూ చెబుతూ రోజా ఏకంగా బాలయ్య డైలాగ్ చెబుతుంది. బాలయ్య హీరోగా నటించిన సింహా సినిమాలో ట్రైన్ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రైన్ వస్తూ ఉంటే ముందు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పుడు ఏమవుతుంది.. ఇక ట్రైన్ వేగంగా వస్తూ ఉంటే ఒక వ్యక్తి ట్రైన్ కు ఎదురుగా వస్తాడు అప్పుడు ఏం జరుగుతుంది అంటూ బాలయ్య డైలాగ్ చెబుతాడు. అచ్చం అలాగే ఒకరు నాకు ఎదురొచ్చినా నేను ఎదురు వెళ్ళినా వాడికే రిస్కు అంటూ చెబుతాడు బాలయ్య. ఇదే డైలాగులు ఎక్స్ ట్రా జబర్దస్త్ స్కిట్ లో చెబుతుంది రోజా..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి