ఇక బాహుబలి సినిమాలో ప్రభాస్ పాన్ ఇండియా హీరో గా మారిపోయారు.. ఇప్పుడు rrr మూవీతో ఇద్దరు హీరోలు కూడా నేషనల్ స్టార్ గా మారిపోతారు ఏమో అనే చర్చ మొదలైంది. బాహుబలి సినిమా విడుదల కాకముందు కేవలం టాలీవుడ్ లో స్టార్ హీరోగా మాత్రమే ఉన్నారు ప్రభాస్. ఆ సినిమా విడుదలైన తర్వాత తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కు మాత్రం హిందీలో అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదని చెప్పవచ్చు. రామ్ చరణ్ గతంలో బాలీవుడ్ లో నటించిన జంజీర్ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది.
అయితే ఇప్పుడు rrr సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ కు కూడా బాలీవుడ్ కు కొత్తగానే ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రభాస్ కు కూడా బాలీవుడ్లో అంతగా పాపులారిటీ లేకపోయినా బాహుబలి సినిమా కంటెంట్ పరంగా బలంగా ఉండడంతో నార్త్ ఇండియన్స్ కి బాగా ఆకట్టుకుంది. అందుచేతనే ప్రభాస్ కు అంత క్రేజ్ ఏర్పడినది. ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు మెప్పిస్తే ఏ హీరో అయినా కూడా ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందుతారని చెప్పవచ్చు. ఇటీవల అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాలో కంటెంట్ బాగా ఉండడంతో ఇక ఆయన నటనకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక మరి ఈ ఇద్దరు హీరోలు సక్సెస్ అవుతారో లేదో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి